ఆ పిటిషన్‌ తక్షణ విచారణకు సుప్రీం నో | Sc Rejects To Hear The Petition On Jammu Kashmirs Article | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రద్దు : పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

Aug 8 2019 11:25 AM | Updated on Aug 8 2019 11:40 AM

Sc Rejects To Hear The Petition On Jammu Kashmirs Article - Sakshi

ఆర్టికల్‌ 370 రద్దు : పిటిషన్‌ తక్షణ విచారణను తోసిపుచ్చిన సుప్రీం

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తక్షణ విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను వెనువెంటనే చేపట్టాల్సిన అవసరం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది.రాజ్యాంగాన్ని సవరించే అధికారంపై  ఐక్యరాజ్యసమితి స్టే ఇస్తుందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ తగిన సమయంలో విచారిస్తుందని పేర్కొంది.

రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం ఆర్టికల్‌ సవరణకు పార్లమెంట్‌ ద్వారా పూనుకోవాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్ లో ఇంటర్నెట్ ఫోన్ సేవల పునరుద్ధరణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను సైతం విచారణకు చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. కాగా జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను మోదీ సర్కార్‌ రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement