లాక్‌డౌన్‌: ట‌్ర‌క్కులో దొరికిన ప్రేమికులు | Russian Woman Her Indian Boyfriend Caught Enters Shimla In Truck | Sakshi
Sakshi News home page

ట్ర‌క్కులో న‌క్కిన ప్రేమికులు

May 7 2020 9:13 AM | Updated on May 7 2020 10:03 AM

Russian Woman Her Indian Boyfriend Caught Enters Shimla In Truck - Sakshi

సిమ్లా: ఎంత క‌ష్టం.. ఎంత క‌ష్టం.. ప్రేమించుకున్న‌వారికి ఇన్ని రోజుల ఎడ‌బాటు ఎంతో క‌ష్టం. అందుకే ఇప్పుడ‌ప్పుడే క‌రోనా పోయేలా లేద‌ని ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకునేందుకు ర‌హ‌స్యంగా జిల్లాలోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కుల్లు జిల్లాలోని నిర్మాండ్ ప్రాంతానికి చెందిన‌ ఇర‌వైయేళ్ల‌ యువ‌కుడు, ముప్పై యేళ్ల ర‌ష్య‌న్‌‌ యువ‌తి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. (చావులో ఒక్కటయ్యారు..)

లాక్‌డౌన్ వ‌ల్ల‌ నోయిడాలోనే ఇరుక్కుపోయిన వీరు స్వస్థ‌లానికి వెళ్లి పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అందుకోసం అక్క‌డి నుంచి వ‌స్తున్న ట్ర‌క్కులో దాక్కున్నారు. అయితే అక్క‌డికి సిమ్లా మీదుగా వెళ్లాల్సి ఉండ‌గా ఆ జిల్లాలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంది. అనుమానం వ‌చ్చిన పోలీసులు షోగి ప్రాంతం వ‌ద్ద‌ ట్ర‌క్కును అడ్డుకుని క‌ర్ఫ్యూ పాస్ చూపించ‌మ‌ని అడ‌గ‌డంతో వారు బిక్క‌మొహం వేశారు. దీంతో జిల్లాలో చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించిన‌ ప్రేమికుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్ర‌క్కు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌ను కూడా ప‌ట్టుకున్నారు. వీళ్లందరినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. (ప్రేమా.. ఇది నీకు న్యాయమా?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement