యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in up 6killed | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 1 2017 10:39 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు - బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సదాబాద్‌ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement