రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ | Rajya Sabha adjourned over meeting with Hafeez Saeed | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ

Jul 14 2014 11:56 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో రాజ్యసభ సోమవారం రెండుసార్లు వెంటవెంటనే వాయిదా పడింది.

న్యూఢిల్లీ :  కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో రాజ్యసభ సోమవారం రెండుసార్లు వెంటవెంటనే వాయిదా పడింది. పోలవరం ఆర్డినెన్స్తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. వేద్ ప్రతాప్ వైదిక్ యోగా గురువు రాందేవ్ బాబాకు సన్నిహితుడు.

 

నరేంద్ర మోడీ అనుమతితోనే హఫీజ్తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ అయ్యారా అని కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రశ్నించారు. ముంబయి పేలుళ్ల నిందితుడితో కలవటమేంటని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో చైర్మన్ హమీద్ అన్సారీ సమావేశాలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement