వచ్చేస్తున్నాడు..!? | Rajinikanth : Political Announcement On His Birthday | Sakshi
Sakshi News home page

వచ్చేస్తున్నాడు..!?

Nov 9 2017 12:10 PM | Updated on Jun 4 2019 6:19 PM

Rajinikanth : Political Announcement On His Birthday - Sakshi

తలైవా రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? ఇంతకాలం వస్తున్న పుకార్లకు పుట్టిన రోజు చెక్‌ పెట్టనున్నారా? కమల్‌హాసన్‌కు పోటీగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అభిమానులు చెబుతున్నారు.

సాక్షి, చెన్నై : తలైవా రజనీకాంత్‌ తన పుట్టిన రోజు డిసెంబర్‌ 12న సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజున రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేస్తారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని గతంలో పలు సందర్భాల్లో రజనీకాంత్‌ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.  

రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం కచ్చితంగా చేస్తారనుకున్న ప్రతి సందర్భంలోనూ.. ఏదో ఒక కారణంతో ఆగిపోయేది. అయితే ఈ దఫా మాత్రం అటువంటిది ఉండదని.. తెలుస్తోంది. తమిళ సినిమా విశ్లేషకులు రమేష్‌ బాల ట్వీట్‌ను అభిమానులు గుర్తు చేస్తున్నారు. రజనీకాంత్‌ పుట్టిన రోజున రాజకీయ అరంగేట్రంపై అధికార ప్రకటన చేస్తారని రమేష్‌ బాల చేసిన ట్వీట్‌ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement