ఒక్కసారి అనుమతివ్వండి ప్లీజ్‌... | Rajastan CM Ashok Gehlot Requestes Central Government To Allow Migrants Come Back to Home | Sakshi
Sakshi News home page

వారికి సాయం చేశారు మరి మన వారికి....

Apr 21 2020 6:22 PM | Updated on Apr 21 2020 6:36 PM

Rajastan CM Ashok Gehlot Requestes Central Government To Allow Migrants Come Back to Home  - Sakshi

వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి కనీసం ఐదు రోజుల పాటైనా ప్రత్యేక రైళ్ల సర్వీసులు కల్పించాలని కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక లేకుండానే లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో రైళ్లు, బస్సులు, ఇతర రవాణా సదుపాయలన్ని రద్దు అయ్యాయి. ఈ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది వలస కార్మికులు, విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ 14 వరకు మొదట లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ తరువాత దానిని మే3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులకు, విద్యార్థులకు తమ తమ ప్రాంతాలకు వెళ్లడానికి ప్రత్యేక రైళ్లు, రవాణా సదుపాయాలు కల్పించాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. (లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన)

ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాలని భావించినప్పుడు విదేశీయులను ఏవిధంగా అయితే వారి దేశాలకు పంపిచారో అలాగే వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు వెళ్లడానికి కనీసం ఐదు రోజుల పాటైనా ప్రత్యేక రైళ్ల సర్వీసులు కల్పించాలని కోరారు. అన్ని రాష్ట్రాల కంటే తమ రాష్ట్ర పరిస్థితి భిన్నమైనదని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. పెద్ద సంఖ్యలో రాజస్తానీలు అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చిక్కుపోయారని వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. వారు తమ స్వగ్రామాలకు వచ్చి వారి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నారన్నారు. ఒక్కసారి వారికి అనుమతినిస్తే లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి వారు తమ పనులపై శ్రద్ధ చూపుతారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రం ఆలోచన చేస్తుందని అమిషా భరోసానిచ్చారని గెహ్లాట్‌ తెలిపారు. విద్యార్ధులు, వలస కార్మికులు తమను స్వగ్రామాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని ఈ విషయంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సీఎంలు కూడా కోరారు. (కరోనా: నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా)


 

Advertisement
 
Advertisement
Advertisement