పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ చేసిన సర్జికల్ దాడుల వాస్తవికతను ప్రశ్నించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ చేసిన సర్జికల్ దాడుల వాస్తవికతను ప్రశ్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆరుగురు వ్యక్తులపై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదుకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటారో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఓ సిటీ కోర్టు ఆదేశించింది. రాహుల్ తదితరులు ఆర్మీ, దేశ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ప్రవేశ్ కుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.