ఛాయ్‌వాలా నెల సంపాదన.. అక్షరాల రూ. 12 లక్షలు | Pune Tea Seller Earn 12 Lakh Rupees Per Month | Sakshi
Sakshi News home page

Mar 4 2018 9:54 AM | Updated on Oct 8 2018 5:45 PM

Pune Tea Seller Earn 12 Lakh Rupees Per Month - Sakshi

యెవ్లే టీ హౌస్ వద్ద దృశ్యం

సాక్షి, పుణే  : మహారాష్ట్రలో ఓ టీ కొట్టు పేరు మీడియాలో మారుమోగిపోతోంది. టీ అమ్మటం ద్వారా నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తూ ఓ ఛాయ్‌వాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో రెండు బ్రాంచ్‌లను ప్రారంభించిన అతను.. తన టీకొట్టుకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు.  

పుణే నగరంలోని ‘యెవ్లే టీ హౌస్’  పేరు జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. దాని ఓనర్‌ నవ్‌నాథ్‌ యెవ్లే నెలకు 12లక్షలు సంపాదిస్తున్నాడు. ‘పకోడా వ్యాపారమే కాదు. టీ అమ్మడం కూడా ఉద్యోగ కల్పన అందజేస్తుంది’ అని అతను చెబుతున్నాడు. 

తన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందంగా ఉందని నవ్‌నాథ్‌ అంటున్నాడు. ఈ మధ్యే యెవ్లే టీ హౌస్‌కు కొత్తగా మరో రెండు బ్రాంచ్‌లను ప్రారంభించినట్లు అతను వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement