15 ఏళ్ల కింద హోటల్లో పాత్రలు కడిగా | Proud that I washed dishes, says Smriti Irani | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల కింద హోటల్లో పాత్రలు కడిగా

Jan 7 2015 4:25 AM | Updated on Sep 2 2017 7:19 PM

15 ఏళ్ల కింద హోటల్లో పాత్రలు కడిగా

15 ఏళ్ల కింద హోటల్లో పాత్రలు కడిగా

ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని గౌరవించాలని, వృత్తి గౌరవాన్ని కాపాడాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచించారు.

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని గౌరవించాలని, వృత్తి గౌరవాన్ని కాపాడాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సూచించారు. మంగళవారమిక్కడ రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులో మాట్లాడుతూ... వృత్తిపరంగా ఒక కూలీని కూడా గౌరవించినప్పుడు ‘మేకిన్ ఇండియా’ కల సాకారమవుతుందన్నారు. ‘నేను 15 ఏళ్ల కిందట ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఓ హోటల్‌లో పాత్రలు కడిగా. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గుపడడం లేదు. వృత్తి ఏదైనా గౌరవం చూపాల్సిందే’ అని ఆమె అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement