ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం | Prime minister Narendra Modi Meets Chief Ministers in Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం

Dec 7 2014 10:21 AM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగే సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ: కొత్త ప్రణాళిక సంఘం ఏర్పాటు అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించడంపై చర్చించేందుకు ప్రధాని తన నివాసంలో ఆదివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రాల వాదనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రులు కోరనున్నారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నేరుగా నిధులనే అందించాలని తమ వాదన వినిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కొత్త ప్రణాళిక సంఘ ఏర్పాటును వ్యతిరేకించే ఆలోచలనలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement