జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు | Pranab mukherjee's son meets Lalu prasad in jail | Sakshi
Sakshi News home page

జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు

Oct 8 2013 4:26 AM | Updated on Sep 1 2017 11:26 PM

జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు

జైల్లో లాలూని కలసిన రాష్ట్రపతి కుమారుడు

రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశానికి రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలు సోమవారం వేదికగా నిలిచింది.

రాంచీ: రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశానికి రాంచీలోని బిస్రాముండా సెంట్రల్ జైలు సోమవారం వేదికగా నిలిచింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అదే జైలులో ఖైదీగా ఉన్న ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో అరగంట పాటు సంభాషించారు. భేటీ ప్రాధాన్యం ఏమిటీ? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఇది పూర్తిగా వ్యక్తిగతం అంటూ అభిజిత్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ తగిన విధంగా స్పందించింది. ఆ పార్టీ నేత సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల విషయంలో లాలూ వెన్నంటి ఉంటామని చెబుతూ ఆయనతో భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement