కశ్మీర్ ప్రభుత్వానికి ప్రధాని అభినందనలు | PM Narendra Modi extends best wishes to new govt in J&K | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ప్రభుత్వానికి ప్రధాని అభినందనలు

Apr 4 2016 2:28 PM | Updated on Aug 15 2018 6:34 PM

జమ్మూ కశ్మీర్ లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

జమ్ము: జమ్మూ కశ్మీర్ లో కొత్తగా కొలువుదీరిన పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను, కలలను నూతన ప్రభుత్వం సాకారం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

జమ్మూకశ్మీర్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మెహబూబా ముఫ్తీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. 56 ఏళ్ల మెహబూబా దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement