గాంధీజీ హత్య కేసులో అమికస్‌ క్యూరీ | Petition in Supreme Court to re-investigate Mahatma Gandhi murder | Sakshi
Sakshi News home page

గాంధీజీ హత్య కేసులో అమికస్‌ క్యూరీ

Oct 7 2017 3:19 AM | Updated on Oct 8 2018 7:53 PM

Petition in Supreme Court to re-investigate Mahatma Gandhi murder  - Sakshi

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించి పునర్విచారణ జరపాలంటూ అభినవ భారత్‌ సంస్థ ట్రస్టీ డా.పంకజ్‌ ఫడ్నీస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమరేందర్‌ శరణ్‌ను అమికస్‌ క్యూరీగా నియమిస్తున్నట్లు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది.

గాంధీ హత్యకు సంబంధించిన ఆధారాలను ఇప్పుడు ఎలా సేకరిస్తారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 1949లో గాడ్సేతో పాటు నారాయణ్‌ ఆప్టేల పిటిషన్లను తూర్పు పంజాబ్‌ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు అసలు విచారించనేలేదని, 1966లో ఏర్పాటు చేసిన జేఎల్‌ కపూర్‌ కమిషన్‌ నివేదిక అత్యున్నత ధర్మాసనానికి సమర్పించలేదని ఫడ్నీస్‌ కోర్టుకు విన్నవించారు.  తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 30కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement