‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ | pawan kalyan fans attack each other, one killed in karnataka | Sakshi
Sakshi News home page

‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ

Apr 9 2016 3:18 AM | Updated on Mar 22 2019 5:33 PM

‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ - Sakshi

‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ

'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు.

నెయిల్ కట్టర్‌తో దాడి... ఒకరి మృతి
 
 పావగడ (కర్ణాటక): తుమకూరు జిల్లా పావగడలో శుక్రవారం పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి  చెందిన  రాకేశ్(20), టీకొట్టు నిర్వాహకుడు రవి.. పవన్ అభిమానులు. వీరు మధ్యాహ్నం స్థానిక అలంకార్ థియేటర్‌లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు.

కుర్చీ కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవి నెయిల్ కట్టర్‌కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. ప్రధాన నరం తెగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్సపొందుతూ మృతి చెందాడు. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో థియేటర్‌లో చిత్ర ప్రదర్శనను నిలిపేశారు.


Advertisement
 
Advertisement
Advertisement