శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికీ వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికీ వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభలో ప్రధాని మోడీ...కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది.