‘నేను దొంగచాటుగా వాట్సాప్‌ వాడుతున్నా..’

Pakistani Spies Expelled From India Suggest Whatsapp To Avoid Detection - Sakshi

న్యూఢిల్లీ‌/ఇస్లామాబాద్: ఢిల్లీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్ల వ్యవహారంలో విస్మయకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని సేకరించేందుకు యత్నించిన పాక్‌ ఏజెంట్‌‌‌ అబిద్‌ హుస్సేన్..‌ భారత్‌ ప్రయోగించిన సీక్రెట్‌ ఏజెంట్‌‌కు వాట్సాప్‌ వాడాలని సూచించాడు. వాట్సాప్‌లో సమాచార బదిలీ చేస్తే ఎవరూ గుర్తించరని పేర్కొన్నాడు. అయితే, సెక్యురిటీ ఆంక్షల వల్ల వాట్సాప్‌ వాడటం వీలు పడదని భారత సీక్రెట్‌ ఏజెంట్‌ చెప్పగా.. తాను దొంగచాటుగా వాడుతున్నానని అబిద్‌ అసలు విషయం వెల్లడించాడు.
(చదవండి: అడ్డంగా దొరికిపోయిన పాక్‌.. భారత రాయబారికి నోటీసులు!)

కాగా పాకిస్తాన్‌ హై కమిషన్‌లో వీసా అధికారులుగా పనిచేస్తున్న తాహిర్‌ ఖాన్‌, అబిద్‌ హుస్సేన్‌ భారత ఆర్మీ రహస్యాలు సేకరించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రవేశించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ ఆధార్‌ కార్డులు ఉపయోగిస్తూ..భారత రక్షణ దళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ వీరిరువురు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దాంతో వారిద్దరినీ భారత్‌ బహిష్కరించింది. నేటి ఉదయం. అత్తారీ బోర్డర్‌ గుండా వారిని పాకిస్తాన్‌ పంపించి వేశారు. అబిద్‌, తాహిర్‌పై కదలికలపై జనవరి నుంచే భారత్‌ నిఘా విభాగం దృష్టి పెట్టినట్టు తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top