భారత్‌లో పర్యటించనున్న పాక్ జ్యుడీషియల్ కమిషన్ | Pakistan judicial panel to cross examine 26/11 witnesses on Sep 24 Mumbai | Sakshi
Sakshi News home page

భారత్‌లో పర్యటించనున్న పాక్ జ్యుడీషియల్ కమిషన్

Sep 20 2013 7:57 PM | Updated on Jul 6 2019 1:10 PM

నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి సాక్షులను విచారించేందుకు 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న భారత్ కు రానుంది.

ముంబై : నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి  సాక్షులను విచారించేందుకు 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న భారత్ కు రానుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పి.వై.లడేకర్ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఘటనలో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్‌కసబ్ వాంగ్మూలాన్ని నమోదుచేసిన నగర న్యాయమూర్తి, కేసులో ముఖ్య నేరపరిశోధన అధికారి రమేష్ మెహలే, సెక్యూరిటీ దళాల చేతిలో హతులైన 9 మంది పాక్ తీవ్రవాదుల పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు డాక్టర్లు పాక్ జ్యుడీషియల్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కమిషన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 మార్చిలో కమిషన్ భారత్‌ను సందర్శించింది. అయితే అప్పుడు సాక్షులను విచారించేందుకు కమిషన్‌కు భారత్ అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నివేదికను పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది.
 
 

 

ఇప్పుడు వస్తున్న కమిషన్‌లో నూతన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఉన్నారు. కమిషన్ సభ్యులకు వారం పాటు పనిచేసే వీసాను బుధవారం ఇవ్వడంతో వీరు భారత్‌కు రానున్నారని  అధికారులు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement