రంగుపడుద్ది.. కానీ రెండే.. | only for two colors | Sakshi
Sakshi News home page

రంగుపడుద్ది.. కానీ రెండే..

Jun 23 2014 12:22 AM | Updated on Sep 2 2017 9:13 AM

రంగుపడుద్ది.. కానీ రెండే..

రంగుపడుద్ది.. కానీ రెండే..

ఫొటోను జాగ్రత్తగా చూడండి. అన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లోనే కనిపించడంలే.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెవెన్ రాజ్ ప్రత్యేకత అదే.

ఫొటోను జాగ్రత్తగా చూడండి. అన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లోనే కనిపించడంలే.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెవెన్ రాజ్ ప్రత్యేకత అదే. ఈయనకు ఎరుపు, తెలుపు రంగులంటే చాలా ఇష్టం. దీంతో ఇంట్లో వాళ్లు వేసుకునే డ్రెస్‌లు, వాడే కారు, బైక్, ఇంటి రంగులు ఇలా అన్నింటా రెడ్ అండ్ వైటే కనిపిస్తుంది. చివరికి టూత్ పేస్టులు, ప్లేట్లు, కత్తులు, కళ్లద్దాలు ఇలా అన్నీ ఈ కలర్స్‌లోనే ఉండాల్సిందే. ఇంట్లో ఒక్క టీవీ, డీవీడీ ప్లేయర్ తప్ప అన్నీ ఈ రంగుల్లోనే ఉంటాయి. రంగుల్లో రెడ్, వైట్ వాడితే.. నంబర్ల విషయానికొచ్చేసరికి ఈయనకు ఏడు అంటే పడి చస్తాడు.

దీనికి తోడు ఆయన పేరు కూడా సెవెన్ రాజే కావడం విశేషం. ఇంట్లో ఏడో సంతానం కావడంతో ఈయన తండ్రి సెవెన్ రాజ్ అని పేరు పెట్టారు. అప్పట్నుంచి ఈయన కూడా ‘7’పై మక్కువ పెంచుకున్నాడు. ఏ ఫోన్ నంబరైనా 777తోనే ముగుస్తుంది. అంతేకాదు.. కోటు వేసినా.. షర్ట్ వేసినా.. దానికి 7 బటన్లే ఉంటాయి. మరీ చిత్రం ఏంటంటే.. ఈయనకు 7 భాషలు మాట్లాడ్డం వచ్చు. ఇన్ని ప్రత్యేకత లుండటంతో స్థానికంగా సెవెన్ రాజ్ సెలబ్రిటీగా మారిపోయాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement