ఏవోబీలో మళ్లీ ఎన్కౌంటర్ | Once again Encounter in AOB, two more maoists killed in a fresh fight | Sakshi
Sakshi News home page

ఏవోబీలో మళ్లీ ఎన్కౌంటర్

Oct 27 2016 9:21 AM | Updated on Mar 28 2019 5:07 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి.

మల్కన్ గిరి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరింది. చిత్రకొండ బ్లాక్ కటాఫ్ ఏరియాలోని రాంఘట్, పనసపుట్ట మధ్య కూంబింగ్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసు బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement