
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎన్‌పీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్‌పీఆర్ డేటాను ఎన్‌ఆర్‌సీకోసం ఉపయోగించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎన్‌పీఆర్‌కి, ఎన్‌ఆర్‌సీకి ఎలాంటి సంబంధం ఉండబోదని గతవారం హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో రవిశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. ‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్) కోసం సేకరించిన డేటాను జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అవసరాల కోసం ఉపయోగించొచ్చు.. లేదా ఉపయోగించకపోవచ్చు’అని రవిశంకర్ ప్రసాద్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘పాస్‌పోర్ట్‌లు, పాన్ కార్డు కోసం డేటా సేకరించినప్పుడు లేని సమస్య ఎన్‌ఆర్‌సీకి మాత్రమే ఎందుకు వస్తోంది, ప్రజలు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు’అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.