రాష్ట్రపతి, ప్రధానితో నరసింహన్‌ భేటీ | Narasimhan meeting with the President and the Prime Minister | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ప్రధానితో నరసింహన్‌ భేటీ

Jun 1 2019 2:33 AM | Updated on Jun 1 2019 2:33 AM

Narasimhan meeting with the President and the Prime Minister - Sakshi

శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలసి శుభాకాంక్షలు తెలుపుతున్న గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన గవర్నర్‌ శుక్రవారం రాష్ట్రపతితో సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వివరించారు. అనంతరం మోదీని కలసి ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కూడా రాష్ట్రపతి, ప్రధానితో భేటీ అయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement