‘నేను దేన్నయినా మేనేజ్‌ చేయగలను’ | my governement in my computer: cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘నేను దేన్నయినా మేనేజ్‌ చేయగలను’

Dec 9 2016 3:50 PM | Updated on Sep 27 2018 9:08 PM

సాంకేతిక పరిజ్ఞానం గురించి తనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ తాను దేన్నయినా మేనేజ్‌ చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానం గురించి తనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ తాను దేన్నయినా మేనేజ్‌ చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రభుత్వమంతా తన కంప్యూటర్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేయాలని తానే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మరోసారి చెప్పారు. నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు జఠిలం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు అంశంపై చెప్పడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు కూడా తమ మైండ్‌ సెట్‌ను మార్చుకోవాలంటూ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement