వైరస్‌ ప్రభావం మరికొన్నాళ్లు : సీఎం | More Testes Can Control Corona Says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

వైరస్‌ ప్రభావం మరికొన్నాళ్లు : సీఎం

May 3 2020 8:21 AM | Updated on May 3 2020 2:27 PM

More Testes Can Control Corona Says Arvind Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌తోనే కరోనా వైరస్‌ పూర్తిగా పోదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని బట్టిచూస్తే కరోనా ఇప్పటితో పోయేలా లేదని, మరికొంతకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని అన్నారు. ఢిల్లీలో శనివారం రాత్రి ఓ సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్‌.. జోన్లతో సంబంధం లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. భారీ సంఖ్యలో టెస్టులు చేయడంతోనే రోగులను గుర్తించి వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మొత్తం జోన్లుగా కాకుండా.. కేవలం కంటైన్‌మెంట్‌ జోన్లను మాత్రమే రెడ్‌ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 3738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసింది. వైరస్‌ కారణంగా 61 మంది మృత్యువాత పడ్డారు. (135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement