మిరాజ్‌ యుద్ధ విమానంతో సర్జికల్‌ స్ట్రైక్‌

Mirage 2000 jets cross LoC, destroy PoK terror camp  - Sakshi

కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసిన భారత వైమానిక దళం

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్‌ వైమానిక దళం... పాకిస్తాన్‌ ఆర్మీకి  దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌ 2000 జెట్‌ ఫైటర్లు...ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్‌ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌)

కీలకపాత్ర పోషించిన మిరాజ్‌ యుద్ధ విమానం...
ఈ దాడుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. మొత్తం 12 మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అధునాతర మల్టీరోల్‌ ఫైటర్‌ అయిన ఈ యుద్ధ విమానం గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. న్యూక్లియర్‌ దాడుల కోసం ఈ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా రూపొందించబడింది. 1550 కిలోమీటర్ల లక్ష్యాన్ని మిరాజ్‌ అవలీలగా ఛేదించగలదు. సెకన్‌కు 280 మైల్స్‌ ఎగిరే సామర్థ్యం ఉండగా, 2X30 కెనాన్లతో 125 రౌండ్లు దాడి చేయగలదు.  (సర్జికల్‌ స్ట్రైక్‌ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!)

  • తొలి దాడి : బాలాకోట్‌లో 3.45 గంటలకు
  • రెండో దాడి : ముజఫరాబాద్‌లో 3.48 గంటలకు
  • మూడో దాడి : చకౌటిలో 3.58 గంటలకు
  • 21 నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన వైమానిక దళం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top