పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Indian Air Force violated LoC And Dropped Payload - Sakshi

300 మంది ఉగ్రవాదుల హతం?

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపా​యి. బాలాకోట్, చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. 

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్‌లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్‌, మిర్వాయిజ్‌, షబీర్‌ షా, ఆశ్రఫ్‌ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఎలాంటి నష్టం జరగలేదు..
భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్‌.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. భారత్‌ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తోందని ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. పాక్‌ వైమానిక దళం ఎదురు దాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కు వెళ్లాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్‌ స్పష్టం చేశారు. భారత్‌ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్‌ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top