పెరిగిన ఉపాధి కూలీ | MGNREGS Wages Hiked | Sakshi
Sakshi News home page

పెరిగిన ఉపాధి కూలీ

Apr 3 2018 2:30 AM | Updated on Apr 3 2018 2:30 AM

MGNREGS Wages Hiked - Sakshi

ఉపాధి హామి పథకం కింద పని చేస్తున్న కూలీలు (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోనూ మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనం రూ.197 ఉండేది. ఈ మొత్తాన్ని రూ.205కు పెంచారు. ఈ నెల 1 నుంచి ఈ పెరిగిన వేతనం అమల్లోకి వచ్చింది.

ఉపాధి కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఏటా పెంచాలని చట్టంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ఎప్పటికప్పుడు పెంచుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉపాధి కూలీల రోజువారీ వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోనే గరిష్టంగా రూ.273 ఉంది. జార్ఖండ్‌లో అతి తక్కువగా రూ.168 వేతనం ఇస్తున్నారు. పెంచిన గరిష్ట వేతనం ప్రకారం కూలీలకు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement