సాక్షి, తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోందంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏని అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకపడి పోయింది.
..ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వలనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.

𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴
From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to… pic.twitter.com/KSvPGgVEsJ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026


