వారిని క్షేమంగా తెస్తాం: కేటీఆర్‌

Medical students will be taken safely - Sakshi

హైదరాబాద్‌: కేరళ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులను సురక్షితంగా  రప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్‌ బింగి మౌర్య రాఘవ్, హన్మకొండకు చెందిన డాక్టర్‌ శారణ్‌ శార్వాణిలు కేరళలోని కొట్టాయం వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంగతిని మొదట సాంస్కృతిక సమన్వయ కర్త కళారత్న మల్లం రమేష్‌ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రాంతీయ అధికారి డాక్టర్‌ పత్తిపాటి మోహన్‌ సహకారంతో మంత్రి కేటీఆర్‌కు శనివారం సమాచారం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌ పూర్తి వివరాలు సేకరించి కేరళలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థినులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయంలోని సంబంధిత అధికారులను ఆదేశించారు. యువ గజల్‌ గాయిని హిమజా సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ కవితకు ఈ విద్యార్థినులకు సంబంధించిన వివరాలను పంపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top