స్టాంప్‌పేపర్‌పై తలాక్‌

Man sends talaqnama to wife on stamp paper in Madhya Pradesh - Sakshi

ఇండోర్‌: ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదించి రెండు రోజులు కూడా గడువకముందే స్టాంపుపై తలాక్‌ చెప్పిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తలాక్‌ ద్వారా విడాకులు ఇస్తానన్న తన భర్త తిరిగి కావాలంటూ, భోజ్‌పురి సినిమాల నటి రేష్మా షేక్‌ (29) పోలీసులను ఆశ్రయించింది. ముదస్సిర్‌ బేగ్‌ (34), తాను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమకు ప్రస్తుతం రెండు నెలల పాప కూడా ఉందని, అతడి కోసం నటన కూడా మానేశానని తెలిపారు.

అయితే తన భర్త విడాకులు ఇస్తున్నానంటూ రూ. 100ల స్టాంపు మీద తలాక్‌ పంపాడు. ఈ విడాకులను తాను అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను నివాసం ఉంటున్న చందన్‌ నగర్‌ పోలీసులుకు విషయం తెలియజేయగా వారు చర్యలు తీసుకోలేదని అన్నారు. పై అధికారులు ఆ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌ శర్మను ప్రశ్నించగా, అది భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ అని తెలిపారు. పలుమార్లు ముదస్సర్‌కు ఫోన్‌ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తలాక్‌ ఎ బైన్, ట్రిపుల్‌ తలాక్‌తో పోలిస్తే భిన్నమైనదని షరియా నిపుణులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top