breaking news
stamp papers
-
త్వరలో ఒకటే స్టాంపు పేపర్!
సాక్షి, హైదరాబాద్: సరికొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లలో రూ.20, రూ.50 విలువగల పేపర్లను రద్దుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల (ఎన్‌జేఎస్) విధానంతోపాటు అనేక అంశాల్లో మార్పులు చేస్తూ కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ విధింపు, మినహాయింపుల్లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త పాలసీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, చర్చల అనంతరం దీనికి తుదిరూపు ఇస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. లాభం లేదు.. భారమే అధికం రాష్ట్రంలో ప్రస్తుతం రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన స్టాంపు వెండార్లతోపాటు రిజి్రస్టేషన్ల శాఖ వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. రూ.50 వేల విలువ వరకు జరిగే లావాదేవీలకు రూ.20.. రూ.లక్ష లోపు లావాదేవీలకు రూ.50.. రూ.లక్ష కంటే ఎక్కువ విలువ ఉండే లావాదేవీలకు రూ.200 చొప్పున (రూ.100 స్టాంపు పేపర్లు రెండు) స్టాంపు పేపర్లను ఉపయోగిస్తున్నారు. పలు రకాల అఫిడవిట్లు, డిక్లరేషన్లు, ఒప్పంద పత్రాలు, సేల్డీడ్లు, కంపెనీల మధ్య ఒప్పందాలు తదితర అనేక లావాదేవీల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.ప్రస్తుతం భౌతికమైన స్టాంపు పేపర్లతోపాటు ఆన్లైన్ ఫార్మాట్ (ఫ్రాంకింగ్)లో ఈ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నాసిక్‌లోని ముద్రణాలయం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వీటి నిర్వహణ, సీలింగ్, పేపర్, రవాణా లాంటి ఖర్చులు కలిపితే రూ.20, రూ.50 స్టాంపులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చవుతోందని, స్టాంపు వెండార్లకు ఇచ్చే 5 శాతం కమీషన్ కలిపితే వీటి అమ్మకాల వల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో రూ.20, రూ.50 స్టాంపు పేపర్లను రద్దు చేయాలని, రూ.100 విలువైన పేపర్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా స్టాంపు పేపర్ల సరఫరా నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుని ఫ్రాంకింగ్ విధానంలో మాత్రమే ముందుకెళ్లేలా కొత్త పాలసీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతి లావాదేవీకి రూ.100 స్టాంపు పేపర్లు కొనుగోలు చేయడం విద్యార్థులు, రైతులు వంటి వర్గాలకు భారమవుతుందని భావించి.. ఆయా వర్గాలు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాల్లో ఇచ్చే అఫిడవిట్లు, డిక్లరేషన్లను మాత్రం ఉచితంగా ఇచ్చేలా పాలసీలో మార్పులు తేవాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు.కొందరికి మినహాయింపు: స్టాంపు డ్యూటీ విషయంలోనూ కొత్త పాలసీలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములు లేదా ఆస్తులను మహిళల పేరిట రిజి్రస్టేషన్ చేస్తే స్టాంపు డ్యూటీలో 1 శాతం మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది. కాంట్రాక్టు పనులకు ప్రస్తుతం గరిష్టంగా రూ.200 స్టాంపు డ్యూటీ విధిస్తుండగా ఇకపై ‘బూట్’ పద్ధతిలో నిర్వహించే కాంట్రాక్టు పనులకు స్టాంపు డ్యూటీని విధించాలని, మొత్తం పని విలువలో 0.5 శాతాన్ని డ్యూటీ కింద వసూలు చేయాలని, ఈ మొత్తం గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
హైదరాబాద్: స్టాంప్ పేపర్లు కావలెను!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో రూ.20 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు కొరత ఏర్పడింది. విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తులతో పాటు వివిధ ధృవీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.20 స్టాంప్ పేపర్ల పంపిణీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి నిలిచిపోయింది. జిల్లా రిజిస్ట్రేటర్ ఆఫీసులతో పాటు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సైతం నిల్వలేకుండా పోయింది. నగరంలో కేవలం ఏడు ఆఫీసుల్లో మాత్రం నామమాత్రంగా స్టాక్ ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్టాంప్ వెండర్స్ వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే రూ.100 స్టాంప్ పేపర్లు సైతం కొరత వెంటాడుతోంది. డిమాండ్ ఉన్నా స్టాక్ లేకుండా పోయింది. ఇండెంట్‌పై అనాసక్తి స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై ఆసక్తి చూపడం లేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ నాసిక్ ముద్రణాలయానికి ఇండెంట్ పెట్టకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగ కొరత కారణంగా బహిరంగ మార్కెట్లో పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయింది. నాసిక్‌లోనే ముద్రణ మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ల శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజి్రస్టార్లకు సరఫరా చేస్తోంది. స్టాక్ అయిపోక ముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్ పూర్తయినా ఇండెంట్ ఊసే లేకుండా పోయింది. గ్రేటర్లో రూ.20 విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్స్ స్టాక్ ఇలా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ స్టాక్ హైదరాబాద్ ఆర్వో 262 కూకట్పల్లి 3000 బాలానగర్ 146 శామీర్ పేట 400 కీసర 437 చేవేళ్ల 1717 ఇబ్రహీంపట్నం 13 -
రూ.100 విలువగల స్టాంప్ పేపర్ల కొరత
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లకు కొరత ఏర్పడింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పం దాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.100లు విలువ గల స్టాంప్ పేపర్ల పంపిణీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నిలిచిపోయింది. స్టాంప్ వెండర్స్ వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.50ల విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు పత్తాలేకుండా పోగా, తాజాగా రూ.100ల స్టాంప్ పేపర్లు సైతం అదే జాబితాలో చేరుతున్నట్లు కనిపిస్తోంది. డిమాండ్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా రెండు మాసాల నుంచి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి స్టాంప్ పేపర్ల కోసం ఇండెంట్ పెట్టనట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డిపోలకు సరఫరా ఆగిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి కేవలం రూ.20ల స్టాంప్ పేపర్లు మాత్రమే పంపిణీ జరుగుతోంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు వీటిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ నిల్వలు కూడా ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండెంట్‌పై అనాసక్తి.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబరుస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల డిమాండ్ ఉన్నప్పటికీ నాసిక్ ముద్రణాలయానికి ఇండెంట్ పెట్టకపోవడం వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కొత్త తరహాలో స్టాంప్ విలువ విక్రయ సేవలు అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబర్చడం ఇందుకు బలం చేకూరుస్తోంది. స్టాంప్ నిల్వలు లేకపోవడంతో జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వివిధ విలువలు గల స్టాంప్ పేపర్ల విక్రయాలు లేకుండా పోయాయి. దీంతో బహిరంగ మార్కెట్లో పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయ్యింది. నాసిక్‌లోనే ముద్రణ.. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు దిగుమతి అవుతాయి. నాసిక్‌లోని ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్ పూర్తయినా ఇండెంట్ ఊసే లేకుండా పోయింది. -
స్టాంప్‌పేపర్‌పై తలాక్
ఇండోర్: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదించి రెండు రోజులు కూడా గడువకముందే స్టాంపుపై తలాక్ చెప్పిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తలాక్ ద్వారా విడాకులు ఇస్తానన్న తన భర్త తిరిగి కావాలంటూ, భోజ్‌పురి సినిమాల నటి రేష్మా షేక్ (29) పోలీసులను ఆశ్రయించింది. ముదస్సిర్ బేగ్ (34), తాను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమకు ప్రస్తుతం రెండు నెలల పాప కూడా ఉందని, అతడి కోసం నటన కూడా మానేశానని తెలిపారు. అయితే తన భర్త విడాకులు ఇస్తున్నానంటూ రూ. 100ల స్టాంపు మీద తలాక్ పంపాడు. ఈ విడాకులను తాను అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను నివాసం ఉంటున్న చందన్ నగర్ పోలీసులుకు విషయం తెలియజేయగా వారు చర్యలు తీసుకోలేదని అన్నారు. పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ శర్మను ప్రశ్నించగా, అది భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ అని తెలిపారు. పలుమార్లు ముదస్సర్‌కు ఫోన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తలాక్ ఎ బైన్, ట్రిపుల్ తలాక్‌తో పోలిస్తే భిన్నమైనదని షరియా నిపుణులు తెలిపారు. -
స్టాంపు పేపర్‌పై మేనిఫెస్టో
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పార్టీ అధినేత అజిత్ జోగీ ఎన్నికల మేనిఫెస్టోను వినూత్నరీతిలో తెచ్చారు. రూ.100 స్టాంపు పేపర్‌పై పార్టీ హామీలను ముద్రించారు. ఇది తన ప్రమాణ పత్రమనీ, గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాననీ, ఓడితే జైలుకైనా వెళ్తానని జోగీ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదనీ, ఆ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలన్నారు. బాండు పేపర్‌పై మొత్తం 14 హామీలను జోగీ ముద్రించారు. రాష్ట్రంలో జన్మించే ప్రతీ ఆడబిడ్డ పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం, ఇళ్లు, స్థలాల అసలైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం, జీఎస్టీతోపాటు ఇంధనంపై పన్నులనూ సగానికి తగ్గించడం, ఒక్కొక్కరికి రూ.7 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా, రిజర్వేషన్లను ప్రభుత్వ రంగంలో వంద శాతానికి, ప్రయివేటు రంగంలో 90 శాతానికి పెంపు తదితర హామీలు వాటిలో ఉన్నాయి. -
స్టాంప్ పేపర్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
పాత స్టాంప్ పేపర్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చంపాపేటకు చెందిన లతీఫ్ ఖాన్, మల్లారెడ్డి అనే వ్యక్తులు 70, 80 సంవత్సరాల పాత స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 75 స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
తప్పొకరిది.. శిక్ష మరొకరికి
ఫ్రాంకింగ్, స్టాంప్ పత్రాల కుంభకోణంలో విచిత్రం తప్పు చేసింది ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు కోర్టు చుట్టూ తిరుగుతోంది స్టాంపు వెండర్లు కరీంనగర్ అర్బన్ : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఫ్రాంకింగ్, స్టాంపు పత్రాల కుంభకోణంలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు చేసిన తప్పునకు స్టాంపు వెండర్లు శిక్ష అనుభవిస్తున్నారు. చలాన్ చెల్లించకుండా కొనుగోలు చేసిన పాపానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. హుజూరాబాద్, మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన విజయ్‌భాస్కర్, సురేశ్ స్టాంపుల లోడింగ్ వ్యవహారంలో రూ. 9లక్షలు, స్టాంపుల విక్రయాలలో రూ.8 లక్షలకుపైగా కాజేసి జేబులు నింపుకున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌ను అరెస్టు చేశారు. భాస్కర్ మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. పాపం.. స్టాంప్ వెండర్స్ స్టాంపు పత్రాలు అమ్ముకుంటూ జీవనం సాగి స్తున్న వెండర్లు చేయని తప్పునకు ఇరుక్కుపోయారు. జిల్లాలోని శైలజ, రవీందర్, కిషన్, రామస్వామి లెసైన్సు పొంది అమ్మకాలు జరుపుతున్నారు. వీరు కొంతకాలంగా అమ్మకాలు సాగిస్తుండడంతో సదరు సీనియర్ అసిస్టెంట్లు పరిచయమయ్యారు. సాధారణంగా వీరు చలాన్ తీసి స్టాంపులు కొనుగోలు చేయాలి. కానీ సదరు సీనియర్ అసిస్టెంట్లను నమ్మి డబ్బులు వారికిచ్చి కొనుగోలు చేశారు. వారు చలాన్ తీయకుండా స్టాంపు పత్రాలు వీరికి అందజేశారు. విచారణలో ఈ విషయం వెలుగుచూడడంతో ఇప్పుడు వెండర్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లించిన అధికారులు ఈ కుంభకోణం బయటకు రావడంతో సదరు అధికారులు డబ్బులు తిరిగి చెల్లించారు. స్టాం పు వెండర్ల నుంచి డబ్బులు రికవరీ చేసినట్లు చూపించారు. అయితే తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని వెం డర్లు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశా రు. తప్పు చేయనిదే ఇద్దరు అధికారులు డబ్బులు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియదా? సాధారణంగా జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఫ్రాంకింగ్ మిషన్‌లో స్టాంపులు లోడింగ్ చేయా ల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన చాలన్లు చెల్లించారో లేదో ఆయన పరిశీలించాలి. అయితే సీనియర్ అసిస్టెంట్లను రిజిస్ట్రార్ నమ్మడంతోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగినట్లు చర్చ సాగుతోంది.