భవనం కూలి ఒకరి మృతి | Man dies in Delhi building collapse | Sakshi
Sakshi News home page

భవనం కూలి ఒకరి మృతి

Dec 25 2015 2:17 PM | Updated on Oct 9 2018 5:39 PM

నిర్మాణంలో ఉన్న భవనం కూలి చోటు(50) కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో ఐదుగురు గాయపడ్డారు.

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50)  అనే కార్మికుడు  దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో  ఐదుగురు గాయపడ్డారు. బేస్మెంట్ నుంచి మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement