మహిళా పోలీస్పై అత్యాచారం | Man booked for raping woman cop | Sakshi
Sakshi News home page

మహిళా పోలీస్పై అత్యాచారం

Jul 8 2015 1:53 PM | Updated on Jul 28 2018 8:51 PM

మహిళా పోలీస్పై అత్యాచారం - Sakshi

మహిళా పోలీస్పై అత్యాచారం

ఓ మహిళ కానిస్టేబుల్ను అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్న కాశీరాం పచొలెపై కేసు నమోదైంది.

భోపాల్: ఓ మహిళ కానిస్టేబుల్ను అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్న కాశీరాం పచొలెపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

తామిద్దరి మధ్య మూడేళ్లుగా పరిచయమున్నట్టు బాధితురాలు చెప్పింది. అయితే కాశీరాంకు పెళ్లయిన విషయాన్ని తన దగ్గర దాచాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి పేరుతో నమ్మించి ఉజ్జయినిలోని ఓ హోటల్లో తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పింది. కేసు నమోదు చేశామని, విచారణాంతరం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement