‘ఆయన ఆంగ్లంలో మాట్లాడలేరు’

Mamata Banerjee Says PM Narendra Modi cannot speak proper English   - Sakshi

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో విమర్శల దాడికి దిగారు. ప్రధాని కనీసం ఒక వాక్యం కూడా ఆం‍గ్లంలో సరిగా మాట్లాడలేరని, ఆయన ఆంగ్లంలో మాట్లాడే సమయంలో నిరంతరం టెలీప్రాంప్టర్‌ వైపు చూస్తుంటారని దీదీ వ్యాఖ్యానించారు. ఈ విషయం మీడియా సహా చాలామందికి తెలుసునన్నారు.

ప్రధాని మోదీ స్క్రీన్‌ వైపు చూస్తూ తనకు ఆంగ్లంలో ప్రావీణ్యమున్నట్లు అక్కడ రాసిన ప్రసంగాన్ని చదివేస్తారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయం చేస్తున్నారంటూ ఆ పథకం నుంచి వైదొలుగుతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించే క్రమంలో ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top