బాసర అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ | maharastra governer CH.Vidya sagar rao at Basara | Sakshi
Sakshi News home page

బాసర అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్

Apr 11 2015 2:10 PM | Updated on Oct 8 2018 6:22 PM

బాసర సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు శనివారం దర్శించుకున్నారు.

ఆదిలాబాద్: బాసర సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు శనివారం దర్శించుకున్నారు. బాసరలో వెలమ సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ వెంట తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.
(భైంసా)

Advertisement
 
Advertisement
Advertisement