ఆ ఊరిలో ప్రేమపెళ్లిళ్లు నిషేధం.. | Sakshi
Sakshi News home page

ఆ ఊరిలో ప్రేమపెళ్లిళ్లు నిషేధం..

Published Thu, May 3 2018 5:09 PM

Love Marriages Ban In Punjab Village - Sakshi

అమృత్‌సర్‌ : ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే ఆ జంటలను గ్రామం నుంచి బహిష్కరించేందుకు కొన్ని గ్రామాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ విధమైన సంఘటన పంజాబ్‌లోని లుథియానా జిల్లా చాంకోయిన్‌ ఖుర్ద్‌ అనే గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామ పెద్దలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ గ్రామంలో ప్రేమ వివాహలను నిషేధిస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటను సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని తెలిపింది. అంతేకాక ఆ గ్రామంలో వారితో ఎవరూ మాట్లాడకూడదు.. ఆ జంటకు సహకరించకూడదని ఆదేశించింది. ఇది ఊరు మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని ఓ పంచాయితీ సభ్యుడు తెలిపాడు.

ఏప్రిల్‌ 29న ఓ జంట కులాంతర వివాహం చేసుకుంది. అది జీర్ణించుకోలేని గ్రామస్తులు.. తమ ఊర్లలో ప్రేమ వివాహం, కులాంతర వివాహాలు చేసుకోవడం తగవని చెప్పారు. దీనిపై గ్రామపంచాయితీలో గ్రామస్తులు సమావేశమయ్యారు. ఇక మీదట గ్రామంలో లవ్‌ మ్యారేజేస్‌ను నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యువకుడి తాత జన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘వారిద్దరూ ప్రస్తుతం మా గ్రామంలో లేరు. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆ అమ్మాయిని బంధువులు ఇంటికి రమ్మని పిలిచారు. అందుకు ఆ యువతి నిరాకరించింది’ అని ఆయన తెలిపారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఈ విధమైనవి తమ దృష్టికి రాలేదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement