చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం | Leopard Attack On People In Jalandhar | Sakshi
Sakshi News home page

చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం

Feb 1 2019 8:17 PM | Updated on Feb 1 2019 8:31 PM

Leopard Attack On People In Jalandhar - Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్‌ గన్‌ను ఉపయోగించి చిరుతను అదుపు చేయడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పారిపోయిన ఈ చిరుత అటవీ మార్గం గుండా జలంధర్‌ చేరుకుని ఉంటుందని పంజాబ్‌ అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని.. అందుకే మత్తులో దించి దానిని బంధించినట్లు తెలిపారు. అనంతరం చాట్‌బిర్‌ జూకు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement