మార్షల్ ఆధీనంలో లగడపాటి | Lagadapati Rajagopal in Marshal's Custody | Sakshi
Sakshi News home page

మార్షల్ ఆధీనంలో లగడపాటి

Feb 13 2014 2:34 PM | Updated on Sep 2 2017 3:40 AM

మార్షల్ ఆధీనంలో లగడపాటి

మార్షల్ ఆధీనంలో లగడపాటి

లోకసభలో 'లగడపాటి రాజగోపాల్' పెప్పర్ స్పే ఘటనలో గాయపడిన ముగ్గురు ఎంపీలకు చికిత్స అందిస్తున్నామని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంసీ) ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

న్యూఢిల్లీ: లోకసభలో 'లగడపాటి రాజగోపాల్' పెప్పర్ స్పే ఘటనలో గాయపడిన ముగ్గురు ఎంపీలకు చికిత్స అందిస్తున్నామని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంసీ) ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు ఎంపీలను మాత్రమే ఆస్పత్రికి తీసుకువచ్చారు అని వైద్యులు వెల్లడించారు.
 
ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన మరికొంత మంది ఎంపీలకు పార్లమెంట్ ఆవరణలోనే వైద్యులు చికిత్స చేస్తున్నట్టు సమాచారం.  పెప్పర్ స్పే చేసిన లగడపాటి రాజగోపాల్ భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలలో లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement