నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే! | Know the Truth Behind Nagapushpa Viral Photo | Sakshi
Sakshi News home page

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

Aug 1 2019 8:06 PM | Updated on Aug 1 2019 8:06 PM

Know the Truth Behind Nagapushpa Viral Photo - Sakshi

నాగపుష్పం పేరుతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో

సోషల్‌ మీడియా వినియోగదారులకు ఈ ఫొటో చిరపరిచితం. దీని పేరు నాగపుష్పమని, హిమాలయాల్లోని మానస సరోవరంలో 36 ఏళ్లకు ఒకసారి వికసి​స్తుందని సామాజిక మాధ్యమాల్లో చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. 2016లో ఉత్పల్‌కుమార్‌ బోస్‌ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో మొదటిసారిగా పోస్ట్‌ చేశారు. ఆయన పేజీ నుంచి 16 వేల మందిపైగా దీన్ని షేర్‌ చేశారు. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

వాస్తవం ఏమిటంటే అసలు ఇది పుష్పమే కాదు. వెన్నుముఖ లేని (ఇన్‌వర్టిబ్రేట్‌) సముద్రజీవి ఇది. దీని పేరు సీ పెన్‌. అంథొజోవా వర్గానికి చెందిన ఈ ప్రవాళ జీవి సముద్రం అడుగు భాగంలో నివసిస్తుంటుంది. వీటి శరీరంలో ఉండే లుమినిసెంట్‌ కణాలు వెలుతురు విరజిమ్మే గుణం కలిగివుండటంతో వివిధ వర్ణాల్లో కనువిందు చేస్తుంటాయి. సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేసే వారికి వీటి గురించి బాగా తెలిసివుటుంది. నాగపుష్పం అనేది సంస్కృతి పదం. నాగపుష్పం శాస్త్రీయ నామం ‘మెసువా ఫెరియా’. ఇది ప్రతి ఏడాది పుష్పిస్తుంది. నాగపుష్పం 36 ఏళ్లకు వికసిస్తుందని, హిమాలయాల్లో ఉంటుందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. వైరల్‌గా మారిన ఫొటో కూడా మొక్కలకు సంబంధించినది కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement