జడ్జీలకు లంచం కేసులో నేడు తీర్పు | judge Supreme Court bench likely to hear plea today | Sakshi
Sakshi News home page

జడ్జీలకు లంచం కేసులో నేడు తీర్పు

Nov 14 2017 2:48 AM | Updated on Oct 4 2018 8:29 PM

judge Supreme Court bench likely to hear plea today - Sakshi

న్యూఢిల్లీ: జడ్జీలకు లంచం ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ విచారణార్హతపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ అంశంపై మంగళవారం తీర్పు వెలువరించే అవకాశముందని జస్టిస్‌ ఆర్‌కె అగర్వాల్‌ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ తెలిపింది.  పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, అది న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని  అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. ఈ పిటిషన్‌ను నవంబర్‌ 9న జస్టిస్‌ జే.చలమేశ్వర్, ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం విచారణకు స్వీకరిస్తూ ఐదుగురు అత్యంత సీనియర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అత్యవసరంగా సమావేశమై. ‘ధర్మాసనాల ఏర్పాటు, కేసుల అప్పగింత అధికారం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తికే ఉంటుంది’ అని తేల్చింది. ఫలానా సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు, కేసు అప్పగింతకు ఇతర ధర్మాసనాలు ఆదేశాలు జారీ చేయలేవని తేల్చి చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సుప్రీంలో ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement