విషం తాగిన ఐపీఎస్‌ అధికారి | IPS Surendra Das consumes poison in Kanpur | Sakshi
Sakshi News home page

విషం తాగిన ఐపీఎస్‌ అధికారి

Sep 5 2018 6:43 PM | Updated on Sep 18 2018 7:34 PM

IPS Surendra Das consumes poison in Kanpur - Sakshi

పోలీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సురేంద్రదాస్ తన అధికారిక నివాసంలో విషం తాగారు.

కాన్పూర్‌ : ఓ యువ ఐపీఎస్‌ అధికారి బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సురేంద్రదాస్ బుధవారం తన అధికారిక నివాసంలో విషం తాగారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
 
తన నివాసంలో కదలిక లేకుండా పడి ఉన్న సరేంద్రదాస్‌ను సిబ్బంది గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. లక్నోలో నివాసముంటున్న సురేంద్రదాస్‌ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సురేంద్రదాస్‌కు మంచి పేరుంది. అతని భార్య డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా భార్యతో తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement