
ఇండో- పాక్ విమాన సర్వీసులకు విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది. కొన్ని విమానాలు అర్థంతరంగా వెనుతిరగగా, మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. జమ్మూ కశ్మీర్‌లోని పలు విమానాశ్రయాల నుంచి ప్రయాణీకుల రాకపోకలను నిలిపివేసి కేవలం ఎయిర్‌బేస్‌లుగా వాటిని వినియోగించేందుకు చర్యలు చేపట్టారు.
మరోవైపు పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలోనూ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు.మరోవైపు పాకిస్తాన్ సైతం లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సియోల్‌కోట్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపివేసింది.