డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్ | Inspired by TV serial, woman, boyfriend kidnap 4-year-old cousin for ransom | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్

Oct 17 2016 11:23 AM | Updated on Sep 4 2017 5:30 PM

డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్

డబ్బు కోసం అడ్డదారి తొక్కిన లవర్స్

టీవీ క్రైమ్ సీరియల్ ప్రేరణగా తీసుకుని కిడ్నాప్ కు పాల్పడిన ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు.

జోధ్ పూర్: టీవీ క్రైమ్ సీరియల్ ప్రేరణగా తీసుకుని కిడ్నాప్ కు పాల్పడిన ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. ఓ యువతి తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి వరసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి చివరకు ఊచలు లెక్కిస్తోంది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో పూర్ణిషా(22) అనే యువతి తన ప్రియుడు మయాంక్ మెహతా, అతడి స్నేహితుడు మయాంక్ సింధాల్ సహాయంతో యుగ్ భండారి(4)ని కిడ్నాప్ చేసింది.

మోటార్ సైకిల్ పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి భండారిని పూర్ణిషా బయటకు తీసుకెళ్లింది. తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ. 50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్ కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు.

ఫోన్ కాల్ రికార్డ్స్, రితేశ్ కుటుంబ సభ్యులను పశ్నించి కేసును ఛేదించినట్టు జోధ్ పూర్ డీసీసీ(వెస్ట్) సమీర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ సీరియల్ ప్రేరణతో కిడ్నాప్ చేశామని నిందితులు చెప్పినట్టు వెల్లడించారు. వీరికి సహకరించిన భరత్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement