'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'

'భారత్ ఎప్పటికీ సహనశీల దేశమే'


న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికీ సహనశీల దేశమేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం లోక్సభలో అసహనంపై జరిగిన చర్చలో రాజ్నాథ్ మాట్లాడారు. దేశ విభజన, ఎమర్జెన్సీ, 1984 అల్లర్ల సమయంలో మాత్రమే దేశంలో అసహనం కనిపించిందని పేర్కొన్నారు.దాద్రి ఘటన జరిగిన వెంటనే యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని, అందులో బీఫ్ గురించి ఏమీ లేదని రాజ్నాథ్ సభకు తెలిపారు. అవినీతి, ఉగ్రవాద, మహిళలపై హింసను సహించబోమని, ఇలాంటి విషయంలో అసహనంగానే ఉంటామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top