ఇంట్లో పాములు.. పొరుగిళ్లలో తలదాచుకుంటూ.. | Group Of Snakes Found In House In Orissa | Sakshi
Sakshi News home page

ఇంట్లో పాములు.. పొరుగిళ్లలో తలదాచుకుంటూ..

Jun 13 2019 4:50 PM | Updated on Jun 13 2019 4:50 PM

Group Of Snakes Found In House In Orissa - Sakshi

ఇంకా కొన్ని నాగు పాము పిల్లలు అక్కడక్కడే తిరుగాడుతున్నట్లు కనిపించడంతో...

భువనేశ్వర్‌ ‌: పిల్లాపాపలు తిరుగాడుతున్న ఆ ఇంటిలో నాగు పాముల సంతతి బయట పడింది. ఒకేచోట  దాదాపు 24 నాగు పాములు దర్శనమివ్వటంతో ఆ కుటుంబానికి భయం పట్టుకుంది. ఇంట్లో ఉండలేక పొరుగిళ్లలో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సంఘటన భద్రక్‌ జిల్లాలోని ధామ్‌నగర్‌ సమితి దిహుడి ఆనందపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనందపూర్‌లో ఉంటున్న ఖగేశ్వర్‌ మహాకుడు అనే వ్యక్తి ఇంటిలో పెద్ద సంఖ్యలో నాగు పాములు బయటపడ్డాయి. తొలుత ఇంటిలోని ఓ కన్నం వద్ద చచ్చిన పాము పిల్ల వారి దృష్టిలో పడింది. అనంతరం ఇంకా కొన్ని నాగు పాము పిల్లలు అక్కడక్కడే తిరుగాడుతున్నట్లు కనిపించడంతో కుటుంబీకుల్లో భయాందోళన మొదలైంది.

దీంతో వెంటనే స్థానిక స్నేక్‌ లైన్‌ వర్గానికి సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ లైన్‌ ప్రతినిధి షేక్‌ మీర్జా రంగంలోకి దిగి ఇంటిలో కాపురం పెట్టిన నాగు పాము సంతతి గుట్టను కనుగొన్నారు. ఒక్కొక్కటిగా వెలికి తీయగా తల్లి పాముతో పాటు  24 నాగు పాము పిల్లలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంటిలో ఉండేందుకు కుటుంబీకులు భయపడుతున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లల్లో తాత్కాలికంగా తలదాచుకుని పాముల కదలిక పట్ల నిఘా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement