బ్యాగులో రెండు గ్రెనేడ్లతో విమానం ఎక్కేందుకు యత్నించిన ఆర్మీ జవాను అరెస్ట్ అయ్యాడు.
గ్రెనేడ్లతో విమానాశ్రయానికి వచ్చిన జవాను అరెస్ట్
Apr 3 2017 10:49 AM | Updated on Aug 20 2018 4:44 PM
జమ్ము కశ్మీర్: శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం ఓ జవాను అరెస్ట్ అయ్యాడు. బ్యాగులో రెండు గ్రెనేడ్లతో విమానం ఎక్కేందుకు యత్నించిన ఆర్మీ జవాను భూపాల్ ముఖియాను ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరీ సెక్టార్‌లోని ఎల్‌వోసీ(నియంత్రణ రేఖ) వద్ద విధులు నిర్వర్తిస్తున్న భూపాల్ శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. సెక్యూర్టీ చెకింగ్‌లో భాగంగా జవాను బ్యాగు చెక్ చేస్తుండగా.. అందులో నుంచి రెండు గ్రెనేడ్లు బయటపడ్డాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisement


