జయ టీవీ ఆఫీసులోకి వరద నీరు | flood water into jaya tv office in chennai | Sakshi
Sakshi News home page

జయ టీవీ ఆఫీసులోకి వరద నీరు

Dec 2 2015 5:50 PM | Updated on Aug 1 2018 3:59 PM

తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 'ది హిందు' దిన పత్రిక 137 ఏళ్లలో తొలిసారి చెన్నైలో ప్రింటింగ్ నిలిపివేయగా.. పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది.

చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 'ది హిందు' దిన పత్రిక 137 ఏళ్లలో తొలిసారి చెన్నైలో ప్రింటింగ్ నిలిపివేయగా.. పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ రెండు టీవీ ఛానళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడింది.  
 
చెన్నై జూపార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంలో వరద నీటిలో వస్తున్న పాములు ఇళ్లు, అపార్ట్మెంట్లలో సంచరిస్తున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement