breaking news
jaya tv office
-
భారీగా పన్ను ఎగవేత.. 327 ఖాతాలు !
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ నినాదంతో తమిళనాట ఆదాయ పన్ను శాఖ అధికారుల మెరుపుదాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 చోట్ల ఈ దాడులు జరగటం చర్చనీయాంశమైంది. శశికళ అండ్ ఫ్యామిలీ రూ. వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగ వేసినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎద్ద ఎత్తున నగదు, నగలు, వెండి, వజ్రాలు సైతం బయట పడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దాడుల్ని శశకళ, దినకరన్ మద్దతు దారులు తీవ్రంగా వ్యతిరేకించి, పలుచోట్ల ఆందోళలనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సన్నిహితుల ఇళ్లలో దాడులు.. ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితులైన నెచ్చెలి శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, భాస్కరన్, వెంకటేషన్, వివేక్, కృష్ణప్రియ తదితరులతోపాటు సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. తొలి రోజు 187 చోట్ల తనిఖీలు జరిగితే, 40 చోట్ల ముగించారు. రెండు రోజు 147 చోట్ల మరింత కట్టుదిట్టమైన భద్రత నడుమ తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నం అయ్యారు. పెద్దమొత్తంలో నగదు, నగలు.. ఇందుకు కారణం, వివిధ ప్రాంతాల్లో శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతు దారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడమే. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో శశికళ కుటుంబం, వారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున నగలు, నగదు, వెండి, వజ్రాలు బయటపడ్డట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీగా పన్ను ఎగవేత.. 327 ఖాతాలు అయితే, రూ 1000 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన రికార్డులు, కొన్ని నకిలీ సంస్థల పేరిట సృష్టించిన బ్యాంక్ పాసు పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల మేరకు 317 మంది పేర్లతో వివిధ బ్యాంకుల్లో 327 ఉన్నట్టు గుర్తించారు. ఆయా బ్యాంకుల్లోని ఈ ఖాతాల్ని సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే కాబోలు దినకరన్‌కు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే కార్యదర్శులు తమ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రూ. వెయ్యి కోట్ల మేరకు.. కీలక ఆధారాలు ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కిన్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్ గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ. 25 లక్షల విలువగల నగలు, వెండి, బయటపడ్డాయనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా పది బినామి సంస్థల వివరాలతో పాటుగా, విదేశాల్లోని అనేక సంస్థల్లో చిన్నమ్మ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని ఉన్నట్లు తెలిసింది. సమగ్ర పరిశీలనానంతరం ఈడీకి అనేక డాక్యుమెంట్లను అందించేందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నట్టు మరో ఐటీ అధికారి పేర్కొన్నారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లో తనిఖీలు.. కాగా, పట్టుబడ్డ దస్తావేజుల్లో అత్యధికం జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యలయాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. దీంతో ఆ ఛానల్, పత్రికలో పనిచేస్తున్న ముఖ్యుల్ని విచారించేందుకు రంగం సిద్ధం అవుతోండటం గమనార్హం. జయ టీవీ కార్యాలయంలో తనిఖీల పుణ్యమా రెండో రోజు కూడా ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. జయం టీవీ అభిమానులంటూ, దినకరన్ మద్దతుదారులు ఆందోళనకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తప్పలేదు. మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తున్నారని జర్నలిస్టుల సంఘాలు ఐటీ వర్గాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. -
శశికళ కుటుంబీకుల పై ఐటీ దాడులు
-
జయ టీవీపై కొనసాగిన సోదాలు
సాక్షి,చెన్నై: జయ టీవీ కార్యాలయం, శశికళ కుటుంబసభ్యులు, సన్నిహితుల కార్యాలయాలు, నివాసాలపై శుక్రవారం రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తిరువూర్, తంజావూర్ జిల్లాలోని 47 ప్రాంతాల్లో సోదాలు పూర్తిచేసినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారి వెల్లడించారు.మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, సోదాలు ఎప్పటివరకూ కొనసాగుతాయన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. సోదాలు జరిగిన చోట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నామని,మరికొన్ని చోట్ల అవసరమైన సమాచారం, పత్రాల కోసం గాలిస్తున్నామని చెప్పారు.ఆయా పత్రాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు బాధ్యులను ప్రశ్నిస్తామని, వీటిపై స్పష్టత వచా్చక మరింత ముందుకువెళతామని తెలిపారు. ఇక చెన్నైలోనే దాదాపు 100 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వీటిలో జయ టీవీ కార్యాలయంతో పాటు జాజ్ సినిమాస్, శశికళ మేనల్లుడు, జయ టీవీ ఎండీ వివేక్ జయరామన్, అతని సోదరి కృష్ణప్రియ నివాసాలున్నాయి. -
జయ టీవీ ఆఫీసులోకి వరద నీరు
చెన్నై: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు, వరద వల్ల 'ది హిందు' దిన పత్రిక 137 ఏళ్లలో తొలిసారి చెన్నైలో ప్రింటింగ్ నిలిపివేయగా.. పుతియ తలైమురై, జయ టీవీ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ రెండు టీవీ ఛానళ్ల ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. చెన్నై జూపార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంలో వరద నీటిలో వస్తున్న పాములు ఇళ్లు, అపార్ట్మెంట్లలో సంచరిస్తున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.