ఐదుగురు చొరబాటుదారుల హతం: జవాన్ మృతి | Five guerrillas, soldier killed as army foils infiltration bid on LoC | Sakshi
Sakshi News home page

ఐదుగురు చొరబాటుదారుల హతం: జవాన్ మృతి

Jul 4 2015 8:34 AM | Updated on Sep 3 2017 4:53 AM

బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి సైన్యం, చొరబాటుదారుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీనగర్: బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

శుక్రవారం ఉదయం నుంచే భారీగా ఆయుధాలు కలిగిన ముష్కర బృందం భారత్లోకి చొరబడేందుకు యత్నించిదని, సైన్యం కాల్పుల్లో ఐదుగురు మరణించగా మరికొందరు పలాయనం చిత్తగించారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement