కావేరిలో మునిగి నలుగురు మృతి | Five drown in Cauvery river in Tamil Nadu | Sakshi
Sakshi News home page

కావేరిలో మునిగి నలుగురు మృతి

Jul 23 2018 4:56 AM | Updated on Jul 23 2018 4:56 AM

Five drown in Cauvery river in Tamil Nadu - Sakshi

సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్‌నాయకన్‌ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్‌ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్‌ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్‌ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్‌ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement