నిర్భయ డాక్యుమెంటరీపై ఎఫ్ఐఆర్ నమోదు | fir filed on nirbhaya documentary | Sakshi
Sakshi News home page

నిర్భయ డాక్యుమెంటరీపై ఎఫ్ఐఆర్ నమోదు

Mar 13 2015 3:51 PM | Updated on Sep 2 2017 10:47 PM

ఇండియాస్ డాటర్స్ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.

న్యూఢిల్లీ:ఇండియాస్ డాటర్స్(భారత పుత్రిక) పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లను అధికారులు పేర్కొనలేదు. గురువారం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.  బ్యాన్ ఎత్తివేయాలంటూ దాఖలైన  పిల్ ను జస్టిస్ బీడీ అహ్మద్ , జస్టిస్  సంజీవ్ సచ్ దేవ్ తో కూడిన డివిజన్ బెంచ్  విచారించింది.

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేస్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనుక నిషేధం  సరైనదే అని కోర్టు తెలిపింది.  దీనిపై తదుపరి విచారణ బుధవారం ఉంటుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement